ఓటర్ ఐడీ లేకున్నా వీటితో ఓటు వేయోచ్చు..!

ఓటర్ ఐడీ లేకున్నా వీటితో ఓటు వేయోచ్చు..!

ఎన్నికల్లో ఓటర్లకు పెద్ద తలనొప్పిగా పరిణమించే పని ఓటర్ గుర్తింపు కార్డును పొందడం.  అన్ని ఫార్మాలిటీస్ సక్రమంగా పూర్తిచేసినా కొందరికి ఓటర్ ఐడీ జారీకాదు.  జారీ అయినా కొన్ని చేతికి అందకుండా మిస్సవుతుంటాయి.  ఓటర్ ఐడీ లేకపోతే ఓటు వేయలేమేమోనని చాలామంది కంగారుపడుతుంటారు.  కానీ ఓటర్ ఐడీకి బదులు ఈ కింది వారిలో ఏ ధృవీకరణ పత్రాన్ని చూపిన ఓటు వేసే వీలుంటుంది.

1. పాస్‌పోర్ట్ 

2. డ్రైవింగ్ లైసెన్స్ 

3. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, పిఎస్‌యులు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫోటో గల సర్వీసు గుర్తింపు కార్డులు

4.  బ్యాంకులు / పోస్టాఫీసులు జారీచేసిన ఫోటో గల పాస్ పుస్తకాలు

5. పాన్ కార్డు

6. ఎన్‌పిఆర్‌ క్రింద ఆర్‌జిఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్

7. ఎంఎన్ఆర్ఇజిఎ జాబ్ కార్డ్

8. కార్మిక మంత్రిత్వ శాఖ పథకం క్రింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్

9.  ఫోటో గల పింఛను పత్రం

10. ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్‌సిలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు

11. ఆధార్ కార్డ్