బావా.. గిఫ్ట్ బాగుంది : అల్లు అర్జున్

బావా.. గిఫ్ట్ బాగుంది : అల్లు అర్జున్

బన్నీకి ఇండస్ట్రీలో ఉన్న మంచి స్నేహితుల్లో హీరో నవదీప్ కూడా ఒకరు.  ఇద్దరూ కలిసి 'ఆర్య 2'లో నటించి మెప్పించారు.  తాజాగా నవదీప్ అల్లు అర్జున్ 'రుద్రమదేవి' సినిమాలో చేసిన గోనగన్నారెడ్డి పాత్రను పోలి ఉండేలా ఒక మంచి బొమ్మను తయారుచేయించి బన్నీకి గిఫ్ట్ ఇచ్చాడు.  దాన్ని అందుకున్న బన్నీ బావ గిఫ్ట్ చాలా బాగుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి తన ఆనందాన్ని పంచుకున్నారు.  2015లో వచ్చిన 'రుద్రమదేవి' చిత్రంలో గోనగన్నారెడ్డిగా బన్నీ నటనకు అన్ని విధాలా ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే.