ధోని రికార్డును బ్రేక్ చేసిన ఆసీస్ మహిళా వికెట్ కీపర్...

ధోని రికార్డును బ్రేక్ చేసిన ఆసీస్ మహిళా వికెట్ కీపర్...

ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హీలీ భారత మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ అయిన ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేసింది. టీ 20 అంతర్జాతీయ క్రికెట్ లో ధోని వికెట్ కీపింగ్ రికార్డును అలిస్సా బద్దలు కోటింది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య టీ 20 సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో వికెట్ కీపర్ గా అత్యధిక మందిని అవుట్ చేసిన ఎంఎస్ ధోని రికార్డును తన సొంతం చేసుకుంది. ధోని ఇప్పటివరకు 98 టీ 20 మ్యాచ్‌ ల్లో 57 క్యాచ్‌లు, 34 స్టంపింగ్‌లతో మొత్తం 91 మందిని పెవిలియన్ కు చేర్చి మొదటి స్థానంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు అలిస్సా 114 మ్యాచ్‌ల్లో 42 క్యాచ్‌లు 50 స్టంపింగ్‌లతో మొత్తం 92 మందిని అవుట్ చేసి ధోనిని వెనక్కి నెట్టింది. ఇక మూడో స్థానంలో 90 మ్యాచ్‌ల్లో 74 మందిని అవుట్ చేసి ఇంగ్లండ్‌కు చెందిన సారా టేలర్ ఉంది. అయితే మూడు మ్యాచ్ ‌ల ఈ సిరీస్‌లో ఆసీస్ ప్రస్తుతం 2-0 తో ఆధిక్యంలో ఉంది.