అమలా పాల్ 'ఆమె' టాక్ ఎలా ఉందంటే..!!

అమలా పాల్ 'ఆమె' టాక్ ఎలా ఉందంటే..!!

అమలా పాల్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ఆమె సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాను ఇప్పటికే కొంతమంది ప్రముఖులు ఈ సినిమాను వీక్షించారు. టీజర్ ముందు వరకు సినిమా గురించి పెద్దగా బయటకు రాలేదు.  టీజర్ రిలీజ్ తరువాత ఒక్కసారిగా అంతా మారిపోయింది.  అమలా పాల్ న్యూడ్ గా నటించింది అని తెలిసి అంతా షాక్ అయ్యారు.  సినిమా కోసం వెయిట్ చేశారు.   సినిమా బాగుందని, అమల నటనతో మెప్పించిందని సెలెబ్రిటీలు ట్వీట్ చేస్తున్నారు. 

సినిమా ఇండస్ట్రీలో ముద్దు సీన్లు వరకు సరే.. కానీ ఇలా బట్టలు లేకుండా నటించాలంటే ధైర్యం కావాలి.  అసలు ఎవరూ ఒప్పుకోరు.  అమలా పాల్ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటున్నారు ప్రముఖులు.  "నా 40 సంవత్సరాల అనుభవంలో ఇలా పెర్ఫామ్ చేసే నటిని ఇంతవరకూ చూడలేదు. మంచి సినిమాలు తీసే దర్శకులు.. అద్భుతంగా పెర్ఫామ్ చేసే నటులు ఉన్నంతకాలం ఇలాంటి మంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి కథ చేయాలంటే గట్స్ కావాలి. బట్టల్లేకుండా షూటింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు.. లొకేషన్‌లో వంద మంది ఉంటారు. దాన్ని పక్కన పెడితే ముందు బట్టల్లేకుండా నటించడానికి ధైర్యం కావాలి. ఓ దర్శకుడు పొరపాటున ఇలాంటి కథ చెబితే.. ఏంటండీ బట్టల్లేకుండా సినిమా చేయమంటారా? అని అడిగే రోజుల్లో.. కథను నమ్మి అమలాపాల్‌ నగ్నంగా నటించడం అంటే చిన్న విషయం కాదని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.  

 కాగా, ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా సినిమా సడెన్ గా రిలీజ్ ఆగిపోయింది.  ఈరోజు మధ్యాహ్నం నుంచి సినిమా థియేటర్లో సందడి చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది.  సెలెబ్రిటీలు ఇప్పటికే సినిమాను చూసి ట్వీట్ చేస్తుండటం విశేషం.  రిలీజ్ తరువాత సినిమాకు ఇది మరింత హైప్ ను క్రేయేట్ చేస్తుందనడంలో సందేహం లేదు.