'ఆమె' వందకోట్ల సినిమాను వదిలేసింది..!!

'ఆమె' వందకోట్ల సినిమాను వదిలేసింది..!!

అమలా పాల్ హీరోయిన్ గా చేస్తున్న ఆమె సినిమా రేపు రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్ ముందు వరకు ఈ మూవీ గురించి పెద్దగా బయట తెలియదు.  కానీ, టీజర్ తరువాత సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది.  

దానికి కారణం ఆమె అందులో న్యూడ్ గా నటించడమే.  ఈ సీన్ తో ఒక్కసారిగా సినిమాకు హైప్ వచ్చింది.  ఈ సినిమాను ఆమె విపరీతంగా ప్రమోట్ చేసింది. కేవలం ఆ ఒక్క న్యూడ్ సీన్ మాత్రమే కాదు.  అలాంటి సన్నివేశాలు ఇందులో ఇంకా అనేకం ఉన్నాయట. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది.  

ఈ సినిమాకంటే ముందు ఆమెకు మహానటి సినిమాలో అఫర్ వచ్చిందట.  నాగ్ అశ్విన్ తనకు మొదట మహానటి సినిమా కథను చెప్పారని, కొన్ని వ్యక్తిగత కారణాల వలన సినిమాను వదిలేసుకున్నట్టు అమలా పాల్ పేర్కొంది.  ఆమె వదిలేసుకున్నాక ఆఫర్ కీర్తి సురేష్ దగ్గరకు వెళ్లిందట.  దాదాపుగా మహానటి వందకోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.  ఆమె సినిమా బాగుంటుందని, తప్పకుండా అందరికి నచ్చుతుందని అంటోంది అమలా పాల్.