అమలా.. స్విమ్ సూట్ లో ఇలా..!!

అమలా.. స్విమ్ సూట్ లో ఇలా..!!

అమలాపాల్ గతంలో తెలుగులో అనేక సినిమాలు చేసింది.  టాప్ హీరోలతో సినిమాలు చేసినా పాపం పెద్దగా కలిసిరాలేదు.  అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో సినిమా చేసింది.  ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ ఆరువాత ఈ హీరోయిన్ రామ్ చరణ్ తో నాయక్ చేసింది.  ఈ మూవీ మంచి విజయం సాధించింది.  దాని తరువాత ఈ భామకు కాలం కలిసిరాలేదు.  

నాయక్ సినిమా హిట్టయినా.. తరువాత సినిమాలు చేయలేకపోయింది.  కాగా, పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు కాపురం తరువాత విడిపోయింది.  ఇటీవలే అమలా పాల్ ఆమె సినిమా చేసిన సంగతి తెలిసిందే.  బోల్డ్ లుక్ తో మెప్పించింది. కాగా, ఈ అమ్మడు ఇప్పుడు విదేశాల్లో విహరిస్తోంది.  స్విమ్ సూట్లో ఎత్తైన కొండలు ఎక్కుతూ తిరుగుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.  ఈ ఫోటోలకు "నన్ను చంపే ప్రతి క్షణం.. నేను బ్రతికే ఉన్నాను అనే అనుభూతిని ఇస్తోంది" అని ట్యాగ్ చేసింది.  ఆ కొండల్లో కాలు జారితే ఇంకేం ఉండదు.  ఎందుకింత సాహసం అని కొందరు నెటిజన్లు మెసేజ్ చేస్తున్నారు.