మళ్ళీ పెళ్లి చేసుకున్న అమలాపాల్ మాజీ భర్త

మళ్ళీ పెళ్లి చేసుకున్న అమలాపాల్ మాజీ భర్త

 

తమిళ హీరోయిన్ అమలాపాల్ కొన్నాళ్ల క్రితమే తన భర్త, దర్శకుడు ఏ.ఎల్. విజయ్ నుండి విడిపోయిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ ఇద్దరూ పూర్తి విడిగానే జీవిస్తున్నారు.  అమలాపాల్ నటిగా బిజీగా ఉంటే విజయ్ దర్శకుడిగా కొన్ని సినిమాలను సెట్ చేసుకున్నారు.  దీంతో ఏ.ఎల్. విజయ్ రెండవ వివాహం చేసుకున్నారు.  చెన్నైకు చెందిన ఐశ్వర్య అనే వైద్యురాలిని ఆయన నిన్న పెళ్లాడారు.  ఈ వివాహ వేడుక కొంతమంది కుటుంబసభ్యుల సమక్షంలో సాధారణ రీతిలో జరిగింది.