బట్టలన్నీ విప్పేస్తేనే బర్త్‌డే డ్రెస్ - అమలాపాల్

బట్టలన్నీ విప్పేస్తేనే బర్త్‌డే డ్రెస్ - అమలాపాల్

అమలాపాల్ నటించిన కొత్త చిత్రం 'ఆడై'.   టీజర్ ద్వారానే బోలెడంత బజ్ సంపాదించుకుంది ఈ చిత్రం.  ఈ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.  ఇందులో అమలాపాల్ క్యారెక్టర్ రివీల్ చేయడం జరిగింది.  ఇందులో అమలాపాల్ సాధారణ అమ్మాయిల్లా కాకుండా అగ్రెసివ్ బిహేవియర్, క్రేజీ థాట్స్ కలిగిన డేరింగ్ అమ్మాయిగా కనిపిస్తోంది.  పైగా పుట్టేటప్పుడు బట్టలతో పుట్టలేదు కాబట్టి బట్టలన్నీ విప్పేస్తేనే అది అసలు సిసలు బర్త్‌డే డ్రెస్ అవుతుంది అంటూ ఆమె చుటున్న డైలాగ్స్ బట్టి ఆమె పాత్ర అసాధారణంగా ఉంటుందని తెలుస్తోంది.  మొత్తానికి చూడబోతే  సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు చాలానే ఉన్నాయని అనిపిస్తోంది.  ఇకపోతే ఈ చిత్రం జూలై 19న విడుదలకానుంది.