నక్క తోక తొక్కిన అమలాపాల్ !

నక్క తోక తొక్కిన అమలాపాల్ !

తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' అనే నవల ఆధారంగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.   మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి లాంటి స్టార్లు నటించనున్నారు.  ఇందులో ఒక పాత్రకు అమలాపాల్ అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట.  ప్రస్తుతం అమలాపాల్ తో చర్చలు జరుగుతున్నాయట.  అన్నీ కుదిరి ఈ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంటే అమలాపాల్ నిజంగానే నక్క తోక తొక్కినట్టే.