అమలాపురంలో వింత ఘటన: కేసుపెట్టిన వాళ్లనే పట్టిచ్చిన డాగ్స్... 

అమలాపురంలో వింత ఘటన: కేసుపెట్టిన వాళ్లనే పట్టిచ్చిన డాగ్స్... 

గత కొంతకాలంగా ఏపీలోని దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఏపీలో దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.  ప్రభుత్వం అలసత్వం వలనే దాడులు జరుగుతున్నాయని, మొదట్లోనే దాడులను సీరియస్ గా తీసుకొని ఉంటె ఇప్పుడు దాడులు జరిగేవి కాదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  ఇక ఇదిలా ఇంతే, అమలాపురంలోని విత్తనాల కాల్వగట్టు వద్ద ఓ చర్చి ఉన్నది.  ఆ చర్చిలోని జీసెస్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారని కొంతంది యువకులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.  కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు స్నిఫర్ డాగ్స్ ను రంగంలోకి దించారు.  అయితే, ఆ స్నిఫర్ డాగ్స్ అన్ని చోట్ల తిరిగి ఎవరైతే జీసెస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని కంప్లైంట్ ఇచ్చారో వారివద్దకు వచ్చి ఆగాయి.  అయితే, తమకు ఎలాంటి సంబంధం లేదని, ఫిర్యాదు చేయడానికి వచ్చామని యువకులు చెప్పారు.  దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.