కరణంపై ఆమంచి సంచలన ఆరోపణలు

కరణంపై ఆమంచి సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నికల్లో తప్పుడు ఆఫిడవిట్‌ సమర్పించారని, ఆయన ఎన్నిక చెల్లదని పేర్కొంటూ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌  హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ 'బలరాంకు నలుగురు పిల్లలు. కానీ ముగ్గురే అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలి' అని కోరారు. బలరాంకు ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలున్నట్టు తన వద్ద బలమైన ఆధారాలున్నాయని చెప్పారు ఆమంచి. ఇందుకు సంబంధించి కొన్ని ఫొటోలు, పత్రాలను బయటపెట్టారు.  కరణం బలరాం తప్పుడు సమాచారాన్ని అన్ని ఆధారాలతో కోర్టులో నిరూపిస్తానని ఆమంచి తెలిపారు.