అందుకే టీడీపీకి రాజీనామా చేశా: ఆమంచి

అందుకే టీడీపీకి రాజీనామా చేశా: ఆమంచి

తన నియోజకవర్గంలోనే కాదు.. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని.. టీడీపీకి రాజీనామా చేయడానికి అవన్నీ కారణాలేనని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు. టీడీపీకి ఇవాళ రాజీనామా చేసిన ఆమంచి.. కొద్దిసేపటి క్రితం వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీకి సంబంధం లేకున్నా తన నియోజకవర్గంలో రాజకీయంగా, సామాజికంగా అనేక ఇబ్బందులు కలిగించారని, ఈ అంశాలన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా సీఎం నివాసంలో, ఆయన పేషీలో ఇతర వ్యక్తులు జోక‍్యం చేసుకున్నారని మండిపడ్డారు. 

పాలన అనేది చంద్రబాబు చేతుల్లో కూడా లేదేమోనని అనిపిస్తోందని.. అనేక మంది వచ్చి వాళ్లే నడిపిస్తున్నారని అన్నారు. ''బాబుకు 70 ఏళ్లు వచ్చాయి. ఆయనకు ఆల్జీమర్స్‌ వచ్చిందేమోనన్న అనుమానం కలుగుతోంది. 'అవును.. కాదు..' అని తప్ప ఇంకేం మాట్లాడరు'' అని ఆమంచి విమర్శించారు. చంద్రబాబు కులతత్వంలో కూరుకుపోయారని.. ఒక కులం గుతాధిపత్యం కోసం ప్రయత్నం జరుగుతోందన్నారు.  

ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరుగుతోందన్నారు. పసుపు కుంకుమ అని పవిత్రమైన పేరుపెట్టి అవినీతి చేశారన్న ఆమంచి.. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదన్నారు. తని ఘటనతో తమకు సంబంధం లేకపోయినా తన సోదరుడి మీద కూడా కేసు పెట్టారని ఆమంచి మండిపడ్డారు.