'జగన్‌ తప్ప మరో ఆప్షన్‌ లేదు'

'జగన్‌ తప్ప మరో ఆప్షన్‌ లేదు'

ఆంధ్రప్రదేశ్‌కు వైసీపీ అధినేత జగన్‌ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వ్యాఖ్యానించారు. ఇవాళ టీడీపీకి రాజీనామా చేసిన ఆయన.. కొద్దిసేపటి క్రితం జగన్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని.. ఆయన వారసుడు జగన్ కూడా అటువంటి వ్యక్తేనని.. అందుకే ఆయన నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. త్వరలోనే మంచిరోజు చూసి వైసీపీలో చేరుతానన్నారు. తన చేరిక సందర్భంగా ఎటువంటి షరతులు పెట్టలేదని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిపైనే చర్చించామన్నారు. తాను టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలవలేదని.. అందుకే ఆ పదవికి రాజీనామా చేయలేదని చెప్పారు. తన గురువు రోశయ్యను కలిశానని.. 'నీ మనసుకు నచ్చిన విధంగా చెయ్యు' అని సూచించారని ఆమంచి తెలిపారు.