రివ్యూ : అమర్ అక్బర్ ఆంటోని

రివ్యూ : అమర్ అక్బర్ ఆంటోని

నటీనటులు : రవితేజ, ఇలియానా, సునీల్, వెన్నెల కిషోర్, షియాజీ షిండే, జయప్రకాశ్ రెడ్డి, తనికెళ్ళ భరణి తదితరులు

మ్యూజిక్ : ఎస్ఎస్ తమన్

సినిమాటోగ్రఫీ : వెంకట్ సి దిలీప్

బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్

డైరెక్టర్ : శ్రీను వైట్ల

విడుదల తేదీ: 16-11-2018

రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్ని మంచి విజయం సాధించాయి.  అన్నీకూడా కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమాలే.  గత కొంతకాలంగా రవితేజ, శ్రీను వైట్లలు మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా తెరకెక్కింది.  మైత్రిమూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది.  మరి ఈ సినిమా ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దాం.

కథ : 

అమెరికాలో స్థిరపడిన రెండు కుటుంబాల కథ ఇది.  ఎప్పుడో ఇండియా నుంచి అమెరికా వెళ్లి అక్కడ రెండు కుటుంబాలు స్థిరపడ్డాయి.  ఈ రెండు కుటుంబాలు అనేక వ్యాపారాలు కలిసి చేస్తుంటారు.  వీరితో పాటు మరో నలుగురిని తమ భాగస్వాములుగా తీసుకుంటారు.  ఈ నలుగురు ఆ రెండు కుటుంబాలు స్థాపించిన వ్యాపారంపై కన్నేస్తారు.  ఆ రెండు కుటుంబాల వారిని అంతం చేస్తారు.  ఈ రెండు కుటుంబాలకు చెందిన రవితేజ, ఇలియానాను వారి నుంచి తప్పించుకుంటారు.  ఇద్దరు చెరో దిక్కుకు వెళ్ళిపోతారు.  ఆ ఇద్దరి లక్ష్యం ఒక్కటే. తమ కుటుంబాలను అంతం చేసిన వారిపై పగ తీర్చుకోవాలి.  మరి వీరు ఆ నలుగురిపై ఎలా పగ తీర్చుకున్నారు..? అమర్ పాత్రలో ఉన్న రవితేజకు అక్బర్, ఆంటోనీలకు ఉన్న సంబంధం ఏంటి అన్నది మిగతా కథ.

విశ్లేషణ : 

శ్రీను వైట్ల కామెడీని జోడించి రివెంజ్ స్టోరీని తయారు చేసుకున్నాడు.  దానికి డిసిసోయేటివ్ ఐడెంటిటీ అనే ఒక జబ్బును యాడ్ చేసి డ్రామాగా సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు.  ఈ మధ్యకాలంలో డీసీస్ కు సంబంధించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.  అదే కోవలోకి వచ్చిన సినిమా ఇది.  ఒక వ్యక్తి తాను చూసిన ఓ వ్యక్తిలా మారిపోతుండటం ఈ రుగ్మత ప్రత్యేకత.  ఇదే సమస్యతో రవితేజ బాధపడుతుంటాడు. ఆ సమస్యను అధికమించి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు అన్నది కథ.  ఇందులో అమర్ లోకి అక్బర్, ఆంటోనీలు ఎలా వస్తారు.. వారు తిరిగి ఎలా వెళ్లారు అనేదాన్ని శ్రీను వైట్ల ఆసక్తికరంగా తెరకెక్కించారు.  అక్బర్, ఆంటోనీలుగా రవితేజ పండించిన హాస్యం అందరికి నవ్వులు తెప్పిస్తుంది.  వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు పాత్రలతో చేసే హంగామా దానికి అదనం.  శ్రీనువైట్ల తన మార్క్ కామెడీని ఇక్కడ చూపించాడు.  సెకండ్ హాఫ్ లో తనకు డిసిసోయేటివ్ ఐడెండిటీ జబ్బు ఉందని తెలుసుకున్న రవితేజ ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది చూపించాడు.  తన డిజాస్టర్ ను పోగొట్టుకొని తన రివెంజ్ ను తెరుచుకోవడంతో సినిమా ముగుస్తుంది.  సెకండ్ హాఫ్ లో పెద్దగా లాజిక్ లు లేవు.  కథలో కొత్తదనం ఉన్నప్పటికీ కథనాల్లో ఆ బిగుతు కనిపించలేదు.  దీంతో సెకండ్ హాఫ్ లో ముందుగా జరగబోయే వాటిని ప్రేక్షకులు ఊహించే విధంగా ఉన్నాయి.

నటీనటుల పనితీరు : 

రవితేజకు ఇలాంటి ఎంటర్టైనర్ చేయడం కొత్తేమి కాదు.  కామెడీని పండించడంలో రవితేజ తన మార్క్ ను చూపించాడు.  ఇలియానా విషయానికి వస్తే, తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు.  రెండు పాటల్లో అందంగా కనిపించింది.  నలుగురు విలన్లు ఉన్నప్పటికీ వారిని సరిగా యూజ్ చేసుకోలేకపోయాడు శ్రీను వైట్ల.  మిగతా నటులు ఎవరి పరిధిమేరకు వారు మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

శ్రీనువైట్ల ఎంచుకున్న కథ కొత్తగా ఉన్నా.. దానిని తెరమీదకు తీసుకొచ్చే విధానంలో ఇబ్బంది పడ్డాడు.  తన మార్క్ కామెడీని చూపించాడుగాని, రివెంజ్ ఇంటెన్సిటీని మాత్రం చూపించలేకపోయారు.  అమెరికా అందాలను, పాటల్లో ఇలియానా అందాలను అద్భుతంగా చిత్రీకరించాడు కెమెరామెన్ దిలీప్.  తమన్ పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ : 

కథ

నటీనటులు

హాస్యం

ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్ : 

కథనాలు

క్లైమాక్స్

చివరిగా : అమర్ అక్బర్ ఆంటోని - రవితేజ మార్క్ కామెడీ