టీజర్ టాక్ : అమర్ అక్బర్ ఆంటోనీ.. ఓ రివెంజ్ స్టోరీ

టీజర్ టాక్ : అమర్ అక్బర్ ఆంటోనీ.. ఓ రివెంజ్ స్టోరీ

వరస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న రవితేజ, శ్రీను వైట్లలు అమర్ అక్బర్ ఆంటోనీ పేరుతో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నారు.  నవంబర్ 16 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.  మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేది మనలో ఉన్న ధైర్యమే అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభమౌతుంది.  ఎక్కడ ఉంటాడో.. ఎలా ఉంటాడో ఎప్పుడు వస్తాడో తెలియదు అని విలన్ వాయిస్ ప్లే అవుతుండగా.. టీజర్ రన్ అవుతుంది.  టీజర్ ను బట్టి చూస్తుంటే ఇది రివెంజ్ స్టోరీగా, రవితేజ మూడు షేడ్స్ లో కనిపిస్తున్నట్టుగా అర్ధం అవుతున్నది.