కష్టాల్లో అమర్ అక్బర్ ఆంటోని..!!

కష్టాల్లో అమర్ అక్బర్ ఆంటోని..!!

రవితేజ హీరోగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమా షూటింగ్ ప్రస్తుతం అమెరికా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది.  ఈ సినిమా ద్వారా ఇల్లి బ్యూటీ తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నది.  ఇంతకు ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ వస్తుండేవి.  కానీ, ఇప్పుడు ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్స్ తెలియడం లేదు.  యూనిట్ కామ్ గా సినిమా షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారట.  

అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం, దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాను కేర్ తీసుకొని షూట్ చేస్తున్నాడట.  శ్రీను వైట్ల సినిమాలు వరసగా పరాజయం పాలవుతుండటంతో.. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు.  సినిమా కాస్త ఆలస్యమైనా పర్లేదు అవుట్ ఫుట్ మాత్రం అద్భుతంగా రావాలనే దీక్షతో పనిచేస్తున్నారు.  ఇంతకు ఈ సినిమాను సెప్టెంబర్ 29  న రిలీజ్ చేయాలని అనుకున్నారు.  కానీ, షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో.. సినిమాను ఈ ఏడాది ఆఖరుకు రిలీజ్ చేస్తారని సమాచారం.