రాజధాని రైతుల పోరు ఉధృతం..! సహాయ నిరాకరణకు నిర్ణయం

రాజధాని రైతుల పోరు ఉధృతం..! సహాయ నిరాకరణకు నిర్ణయం

ఓవైపు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపై ముందుకు వెళ్తూనే ఉంది.. ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. అయితే, రాజధాని అమరావతి ప్రాంత రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు. మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పట్టి నుంచి ఆందోళన కొనసాగిస్తూనే ఉండగా.. రాజధాని రైతుల పోరు 35వ రోజుకు చేరింది. ఇక, రైతులపై లాఠీచార్జికి నిరసనగా ఇవాళ రాజధాని గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది. పోలీసులకు పూర్తిగా సహాయ నిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు. మంచి నీళ్లు సహా ఎలాంటి పదార్థాలు పోలీసులకు విక్రయించారాదని నిర్ణయించారు. పోలీసులు అడ్డుకుంటే ఎక్కడికక్కడ జాతీయ జెండాలతో నిరసనలు తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. మందడం, తుళ్లూరుల్లో మహా ధర్నాలు నిర్వహిస్తోన్నారు రైతులు.. వెలగపూడి, కృష్ణాయపాలెంలో 35వ రోజు రైతు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయినిపాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు నిరసన, మహిళలు పూజలు చేయనున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇతర రాజధాని గ్రామాల్లో రైతుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.