ప్రతిరోజూ వీటిని తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం...

ప్రతిరోజూ వీటిని తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం...

సమతుల్య ఆహారం తీసుకుంటే శరీరానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  అలా కాకుండా సరైన ఆహరం తీసుకోకపోతే, శరీరం రోగాల బారిన పడుతుంది.  ఇలాంటి సమయంలో రోజువారి ఆహారంలో నువ్వులు తీసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు.  నువ్వుల్లో ఇనుము శాతం అధికంగా ఉంటుంది.  నువ్వులు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే, ఇనుము లోపం నుంచి బయటపడొచ్చు. నువ్వులతో కూడిన ఆహరం తీసుకుంటే, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.  రక్తహీనత నుంచి బయటపడాలంటే నువ్వుల ఆహరం తప్పకుండా తీసుకోవాలి.  ఉబ్బసంతో బాధపడేవారు నువ్వుల ఆహారాన్ని తీసుకుంటే దాని నుంచి బయటపడొచ్చు.