ఐకియా.. ఐవీఆర్ రైడింగ్ ఆసమ్

ఐకియా.. ఐవీఆర్ రైడింగ్ ఆసమ్

రిటైల్ బ్రాండ్ షోరూం ఐకియా ఇండియాలో లాంచ్ చేశారు. హైదరాబాద్ లోని మాదాపూర్ ఏరియాలో ఈ షోరూం ను ఏర్పాటు చేశారు.  ఇంటికి కావలసిన అన్నిరకాల వస్తువులు ఐకియాలో అందుబాటులో ఉన్నాయి.  ఈ షోరూం ఓపెనింగ్ సందర్భంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఐకియా నిర్వాహకులు నగరంలో ఐవీఆర్ ఆటతో రైట్ ను ఏర్పాటు చేశారు.  ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ పార్క్ నుంచి ఐకియా ఆటోను బుక్ చేసుకొని ప్రయాణించే వారికీ ఐవీఆర్ ద్వారా అద్భుతమైన రైడింగ్ ను అందిస్తున్నారు.  ఆటో కూర్చొని ప్రయాణిస్తుండగా.. మార్గమధ్యంలో అనేక వస్తువులు మన కళ్ళకు కనిపిస్తుంటాయి. ఐవీఆర్ 3డి ద్వారా రూపొందిన ఐకియా రైడ్ నగర ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.