కారును ఇలా కూడా వాడుకోవచ్చా? 

కారును ఇలా కూడా వాడుకోవచ్చా? 

ప్రయాణాలంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు.  ఎక్కువ దూరం ప్రయాణం చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేయాలని అనుకునే వ్యక్తులు సొంతంగా వాహనాలను సెట్ చేసుకొని ప్రయాణాలు చేస్తుంటారు.  కొంతమంది సైకిల్స్ ను ప్రయాణాలకు అనుకూలంగా మార్చుకుంటే,మరికొంతమంది బైక్స్ ను, కార్లను లాంగ్ డ్రైవ్ కు అనుకూలంగా మార్చుకుంటారు.  లాంగ్ డ్రైవ్ చేసే సమయంలో ఎక్కడ పడితే అక్కడ స్టే చేస్తుంటారు.  స్టే చేయాల్సి వచ్చినపుడు ఏ హోటల్ కో వెళ్ళవలసి ఉంటుంది.  అలా కాకుండా లాంగ్ డ్రైవ్ కు వినియోగించే కారుని స్టార్ హోటల్ గా మార్చుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో నాథనిల్ వైస్ అనే వ్యక్తి కారులోపలి భాగాన్ని ప్రయాణాలకు అనుగుణంగా మార్చుకున్నాడు.  వెనుక డిక్కీ డోర్ ఓపెన్ చేయగానే బెడ్ కనిపిస్తుంది.  బెడ్ ను పక్కకు జరిపితే కావాల్సిన వస్తువులు, చిన్న ఫ్రిజ్, కిచెన్ అన్ని కనిపిస్తాయి.  అన్నింటిని తన కారులో నింపేసుకున్నాడు.  2018 నుంచి రీ మోడల్ కారులో లాంగ్ డ్రైవ్ చేస్తున్నాడు నాథనిల్ వైస్.  దీనికి సంబంధించిన వీడియోలో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నది.