ఆఫర్ల పండుగ.. రిపబ్లిక్‌ డే సేల్‌కు రెడీ..

ఆఫర్ల పండుగ.. రిపబ్లిక్‌ డే సేల్‌కు రెడీ..

పండుగల సమయంలో ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలో పడిపోతాయి ఈ-కామర్స్ సంస్థలు... ఇక, రిపబ్లిక్‌డే వస్తుందంటే చాలు.. స్టోర్ల నుంచి ఈ-కామర్స్ సంస్థల వరకు అంతా ఆఫర్ల తీసుకొచ్చి తమ సేల్స్‌ పెంచుకునేలా ప్లాన్ చేస్తుంటారు.. జనవరి 26 రిపబ్లిక్‌డేను పురస్కరించుకుని ఈ-కామర్స్ దిగ్గజాలు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్స్‌కు శ్రీకారం చుట్టాయి.. ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ను అమెజాన్‌ ప్రకటించగా.. ఈ ప్రత్యేక ఆఫర్ల పండుగను జనవరి 20 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఇక, అమెజాన్‌ ప్రైమ్ సభ్యులకు జనవరి 19 నుంచే ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి.. ఈ సారి స్మార్ట్‌ఫోన్లపై గతంలో ఎన్నడూ లేనంత భారీ డిస్కౌంట్లు ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రైమ్ సభ్యులకు 20 నుంచి 22వ తేదీల్లో రాత్రి 8 గంటలకు భారీ డిస్కౌంట్‌ను ఇస్తామని అమెజాన్ ప్రకటించింది. వీటికి తోడు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ పొందే అవకాశం కూడా ఉంది. 

మరోవైపు.. ఫ్లిప్‌కార్ట్ కూడా రిపబ్లిక్‌డే సేల్‌కు సిద్ధమైంది.. ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో ఆఫర్ల పండుగ తెస్తోంది ఫ్లిప్‌కార్ట్.. జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు ఈ సేల్ ఉంటుందని వెల్లడించింది సంస్థ.. ఈ ఆఫర్ల పండుగలో.. ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం డిస్కౌంట్‌, టీవీలపై 75 శాతం వరకూ డిస్కౌంట్లు ఉంటాయని ప్రకటించింది.. ఇక, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను కూడా పొందే అవకాశం కల్పిస్తోంది ఫ్లిప్‌కార్ట్.. మొత్తంగా రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రత్యేక సేల్స్‌లో వినియోగదారులకు ఆఫర్ల పండుగ తీసుకువచ్చాయి ఈ-కామర్స్ దిగ్గజాలు. మరి ఈ సారి సేల్స్ ఎలా సాగుతాయో చూడాలి.