అమెజాన్ సీఈవోతో భార్య విడాకులు

అమెజాన్ సీఈవోతో భార్య విడాకులు

ప్రముఖ ఆన్ లైన్ వ్యాపారం దిగ్గజం అమెజాన్ సీఈవో , పౌండర్ జెఫ్ బెజో ఆయన భార్య మెక్ కెంజే తో విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని జెఫ్ బెజో తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. వారు 25 ఏళ్లు కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకున్నారు. భార్యభర్తలుగా తాము విడాకులు తీసుకున్నా స్నేహితులుగా కొనసాగుతామని పేర్కన్నారు. వారు 1993 న్యూయార్క్ లో కలుసుకున్నారు. ఇద్దరు కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అదే సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమెజాన్ ను ఏర్పాటు చేశారు. అందులో ఆమె అకౌంటెంట్ గా జీవితం ప్రారంభించారు.  ఆ తర్వాత నెట్ బుక్ సెల్లర్ లో ఆమే మొదటి ఉద్యోగి.  ప్రస్తుతం ఆమెజాన్ ఆస్థుల విలువ  160 బిలియన్ డాలర్లు.