వైర‌ల్‌: ఆక‌ట్టుకుంటున్న డెలివ‌రీ బాయ్‌...ఇదే కార‌ణం...

వైర‌ల్‌: ఆక‌ట్టుకుంటున్న డెలివ‌రీ బాయ్‌...ఇదే కార‌ణం...

ఈ కామ‌ర్స్ అందుబాటులోకి వ‌చ్చాక, వేలాది మంది నిరుద్యోగుల‌కు ఉపాది దొరికింది.  డెలివ‌రి బాయ్ గా ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు.  ఎంత వేగంగా ఆర్డ‌ర్లు డెలివ‌రీ చేయ‌గ‌లిగితే అంత పేరు వ‌స్తుంది. డ‌బ్బులు వ‌స్తాయి.  ఆర్డర్లు డెలివ‌రీ చేయాలి అంటే టూవీల‌ర్ త‌ప్ప‌నిస‌రీ.  కానీ, కాశ్మీర్ కు చెందిన ఒ డెలివ‌రీ బాయ్ వినూత్నంగా ఆర్డ‌ర్లు డెలివ‌రీ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నాడు.  టూవీల‌ర్‌, ఫోర్ వీల‌ర్ కాకుండా, వ‌స్తువుల‌ను డెలివ‌రీ చేసేందుకు గుర్రంను వినియోగించాడు.  గుర్రంపై వెళ్లి వినియోగ‌దారుల‌కు వ‌స్తువుల‌ను అంద‌జేస్తున్నాడు.  ప్ర‌స్తుతం కాశ్మీర్‌లో మంచు విప‌రీతంగా కురుస్తోంది.  రోడ్డుపై పెద్ద ఎత్తున మంచు పేరుకుపోవ‌డంతో గుర్రాన్ని వినియోగించి ఆర్డ‌ర్లు డెలివ‌రీ చేస్తున్న‌ట్టు చెప్పుకొచ్చాడు అమెజాన్ డెలివ‌రీ బాయ్‌. ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.