అమెజాన్‌కు నష్టాల బెడద

అమెజాన్‌కు నష్టాల బెడద

ఆన్‌లైన్‌ మార్కెట్లో అగ్రస్థాయిలో దూసుకుపోతున్న అమెజాన్‌కు నష్టాల బెడద తప్పడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ రూ.5,685 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.6,287 కోట్లతో పోలిస్తే 9.5 శాతం తక్కువ ఇది. బిజినెస్‌ ఇంటిలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ టోఫ్లర్‌ వద్ద ఉన్న సమాచారం మేరకు ఈ విషయం వెల్లడైంది. లాభాల్లో ఎదురుదెబ్బ తగిలిన సంస్థకు ఆదాయంలో మాత్రం కాస్త ఊరట లభించింది. 2018-19 ఏడాదికిగాను సంస్థ ఆదాయం 55 శాతం ఎగిసి రూ.7,778 కోట్లుగా నమోదైంది. ఇతర సంస్థలను కలుపుకొంటే గతేడాది సంస్థ 7 వేల కోట్ల నష్టాన్ని ప్రకటించింది.