గుడ్‌న్యూస్‌... అమెజాన్ మరో కీలక ప్రకటన...!

గుడ్‌న్యూస్‌... అమెజాన్ మరో కీలక ప్రకటన...!

భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని ప్రకటించిన ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరో కీలక ప్రకటన చేసింది. రానున్న ఐదేళ్లలో భారత్‌లో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించింది.  ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఐటీ, నైపుణ్యాభివృద్ధి, కంటెంట్‌ క్రియేషన్‌, రిటైల్‌, లాజిస్టిక్స్‌, తయారీ పరిశ్రమల్లో ఉద్యోగాలు సృష్టించనున్నట్లు అమెజాన్‌ తెలిపింది. గత ఆరేళ్లలో అమెజాన్‌ పెట్టుబడుల ద్వారా 7 లక్షల మందికి ఉపాధి లభించిందని, రానున్న ఐదేళ్లలో కల్పించే ఉద్యోగాలు దీనికి అదనమన్నారు. భారత్‌లో 7వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కాగా, ఓ వైపు తాము భారత్‌లో 1 బిలియన్ డాలర్లు దాదాపు రూ.7100 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అమోజాన్ సిద్ధమైంది... ఈ విషయాన్ని అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వెల్లడించారు... చిన్న, మధ్యతరగతి వ్యాపారాలను డిజిటలైజేషన్‌ చేసేందుకు గాను భారత్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. అయితే, దీనిపై స్పందించిన కేంద్రమంత్రి పియూష్ గోయల్... అమెజాన్ ఏమీ భారత్‌కు గొప్ప సాయం చేయడం లేదు అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.