మహర్షికి మించేలా ఇస్తామంటున్న అమెజాన్

మహర్షికి మించేలా ఇస్తామంటున్న అమెజాన్

ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక డిజిటల్ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది.  డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టిన నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ లు దూసుకుపోతున్నాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఎక్కువ సినిమాలను సొంతం చేసుకుంటున్నాయి.  మహేష్ బాబు మహర్షి సినిమా డిజిటల్ రైట్స్ దాదాపుగా రూ. 11 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది అమెజాన్. 

ఇప్పుడు మహేష్ 26 వ సినిమాపై దృష్టి పెట్టింది.  ఈ సినిమా ఇంతవరకు ప్రారంభం కాలేదు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.  వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్నది.  అప్పుడే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకోవడానికి అమెజాన్ సంస్థ మంతనాలు జరపడం మొదలుపెట్టింది.  డిజిటల్ రంగంలో పోటీ ఉండటంతో...పాటు, మహేష్ మహర్షి సూపర్ హిట్ కావడం, అలాగే, అనిల్ రావిపూడి 100 శాతం సక్సెస్ లో ఉండటం,దూకుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి.  అందుకే ముందుగానే సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకోవడానికి అమెజాన్ సంస్థ సిద్ధం అయ్యింది.