హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద ఫుల్‌‌‌‌ఫిల్‌‌‌‌మెంట్ సెంటర్

హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద ఫుల్‌‌‌‌ఫిల్‌‌‌‌మెంట్ సెంటర్

అమెరికా ఇ-కామర్స్ సంస్థ అమెజాన్.. దేశంలోనే అతిపెద్ద ఫుల్‌‌‌‌ఫిల్‌‌‌‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో విస్తరించేందుకు పూనుకుంది. దీనికోసం జీఎంఆర్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ సిటీతో అమెజాన్ ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ నెల 1వ తేదీన ఈ ఒప్పందం కుదిరినట్టు ప్రకటించింది అమెజాన్. ప్రస్తుతం ఈ సెంటర్‌ 4 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉండగా... మరో లక్షా 80 వేల చదరపు అడుగుల్లో దీన్ని విస్తరించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌తో అమెజాన్ ఇండియాకు తెలంగాణలో 3 ఫుల్‌‌‌‌ఫిల్‌‌‌‌మెంట్ సెంటర్లు 8 లక్షల 50 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉండనున్నాయి. భారతదేశంలో మా అతిపెద్ద ఫుల్‌‌‌‌ఫిల్‌‌‌‌మెంట్ సెంటర్‌ను విస్తరించడంతో, ఈ ప్రాంతంలో మరెన్నో వందల మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టించడానికి వీలు కలుగుతుందని... దీనికి తాము ఎంతో సంతోషిస్తున్నట్టు, స్థానిక మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునేందుకు వేలాది మంది స్థానిక అమ్మకందారులను శక్తివంతం చేయనున్నట్టు, తద్వారా వారికి మూలధనాన్ని ఆదా చేయడానికి, వృద్ధి చెందడానికి సహాయపడుతుంది వెల్లడించారు అమెజాన్, కస్టమర్ ఫుల్‌‌‌‌ఫిల్‌‌‌‌మెంట్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా.