అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌ పోటాపోటీ ఆఫర్లు..! వినియోగదారులకు పండగ..!

అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌ పోటాపోటీ ఆఫర్లు..! వినియోగదారులకు పండగ..!

పండుగ వచ్చిందంటే చాలు..! ప్రత్యేకత ఏమైనా ఉందంటే చాటు.. ఆఫర్లతో వినియోగదారులను ఆక్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ఈ-కామర్స్ సంస్థలు.. ఇప్పుడు ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సేల్స్ పెంచుకోవడానికి ఓవైపు అమెజాన్.. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ పోటీ పడుతున్నాయి. అమెజాన్ ఫ్రీడం సేల్ పేరుతో ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు భారీ ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వస్తుండగా... ఇక ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు నేషనల్ షాపింగ్ డేస్ సేల్స్ నిర్వహించనుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలు రెండూ వర్గాలలో పెద్ద ఎత్తున డిస్కౌంట్లతో వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. 

అమెజాన్ ఫ్రీడం సేల్‌లో వన్ ప్లస్ 7, శాంసంగ్ గెలాక్సీ ఎం30, రెడ్‌మి వై30, ఆనర్ 20ఐ, రెడ్‌మి 7, నోకియా 6.1 ప్లస్, ఆనర్ 8 ఎక్స్, రెడ్‌మి 6ఎ, ఎల్‌జి డబ్ల్యూ10 స్మార్ట్‌ఫోన్లతోపాటు పలు ఇతర మొబైళ్లపైనా భారీ డిస్కౌంట్లు లభించనుండగా.. ఫ్లిప్‌కార్ట్ నేషనల్ షాపింగ్ డేస్ సేల్‌లో మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లెట్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీ స్పీకర్లు, ఇతర పాపులర్ ప్రొడక్ట్ కేటగిరీల్లోనూ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఇక ఫ్లిప్‌కార్ట్ తన ప్లస్ సభ్యులకు ఆగస్టు 7వ తేదీ నుంచే కొనుగోతు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో లావాదేవీలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ పొందొంచు. మరోవైపు అమెజాన్ తమ ప్రైమ్ మెంబర్స్‌కు ఆగస్టు 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచే స్పెషల్ సేల్స్ అందుబాటులోకి తెస్తుంది. ఇక, అమెజాన్‌లో ఎస్‌బీఐ కార్డుపై లావాదేవీలు చేసేవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.