సిద్ధి వినాయకునికి ఇషా అంబానీ పెళ్లి కార్డు 

సిద్ధి వినాయకునికి ఇషా అంబానీ పెళ్లి కార్డు 

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.. కుమార్తె ఇషా అంబాని పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ముంబయిలోని సిద్ధి వినాయకున్ని అంబానీ కుటుంబం దర్శించుకుంది. ఇషా అంబానీ, ఆనంద్ పిరమిల్ మొదటి వెడ్డింగ్ కార్డును స్వామికి సమర్పించి పూజలు చేశారు. సిద్ధివినాయకుని ఆశీర్వాదాలు పొందారు. వారితో ముఖేష్ తల్లి కోకిలా బెన్ అంబానీ, ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఉన్నారు. గత నెల ఆయన కూతురు ఇషా అంబానీ, ఆనంద్ పిరిమిల్ ఎంగేజ్ మెంట్ ఇటలీలో ఘనంగా జరిగింది. డిసెంబర్ లో వారి పెళ్లి జరుగనుంది. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ కుర్తా ధరించి కనిపించారు. నీతా అంబానీ కూడా కుర్తా, ఎర్రటి దుప్పట ధరించి సంప్రదాయకంగా కనిపించారు.