పోలీసులు స్పందించకపోతే నిరాహార దీక్ష చేస్తా..

పోలీసులు స్పందించకపోతే నిరాహార దీక్ష చేస్తా..

గుంటూరు జిల్లాలో పోలింగ్ రోజున ఎలక్షన్ బూత్ లలో టీడీపీ నేతలు జరిపిన దాడులు, దౌర్జన్యాలపై పోలీసుల విచారణ నిష్పక్షపాతంగా జరగాలని వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపించారు. సంఘటనా స్థలంలో లేని వ్యక్తి మా పై ఫిర్యాదు చేశారని అన్నారు. హత్యాయత్నం సెక్షన్ కింద కేసు నమోదు చేయడం దారుణమని అన్నారు. మా ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారన్నారు. ముప్పాళ్ల ఎస్ఐను సస్పెండ్ చేయాలని అంబటి డిమాండ్ చేశారు. రేపు సాయంత్రం లోపు పోలీసులు స్పందించకపోతే నిరహారదీక్షకు దిగుతానని తెలిపారు. కోడెల శివప్రసాద్ కులాలను, ప్రాంతాలను రెచ్చగొట్టి అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బూత్ క్యాప్చరింగ్ కు ప్రయత్నించిన కోడెల ప్రజలకు అడ్డంగా దొరికిపోయారని అన్నారు. తక్షణమే కోడెల, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.