చంద్రబాబు ఢిల్లీలో ఎందుకు దీక్ష చేయరు?

చంద్రబాబు ఢిల్లీలో ఎందుకు దీక్ష చేయరు?
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయబోయే ధర్మపోరాట దీక్షపై సెటైర్లు వేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు... నాలుగేళ్లపాటు ధర్మాన్ని పరిరక్షించని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు దీక్షలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు దీక్షకు జనాలని తరలించేందుకు అధికారాలు నిమగ్నమయ్యారని ఆరోపించిన అంబటి రాంబాబు... ధర్మాన్ని రక్షించటానికి చంద్రబాబు ఎపుడైనా ప్రయత్నించారా?... అధర్మం ఆయన పరిపాలన చేస్తున్న చంద్రబాబుని ధర్మాన్ని కాపాడుతారా? ఆయన ఢిల్లీలో ఎందుకు దీక్ష చేయరని ప్రశ్నించారు. పని తక్కువ ప్రచారం ఎక్కువ అన్నట్టుగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు అంబటి రాంబాబు... పబ్లిసిటీ కోసం పాకులాడడం మానేసి హోదా కోసం పోరాటం చేయాలన్నారు. ఎంతో అనుభవం అన్ని చెప్పుకునే చంద్రబాబు... అనుభవం లేని వైఎస్ జగన్ ను ఎందుకు ఫాలో అవుతున్నారు...? ఎన్నో మోసాలు చేస్తున్న చంద్రబాబుని 420 అంటే తప్పా...? చంద్రబాబు చేస్తుంది 420 దీక్ష కాదా? అంటూ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు చేస్తున్న దీక్షకు విలువ లేదన్నారు అంబటి.