పవన్ 2 కిలోమీటర్లే నడవలేడు... సీమ నుంచి రాజధానికి నడుస్తారా..?

పవన్ 2 కిలోమీటర్లే నడవలేడు... సీమ నుంచి రాజధానికి నడుస్తారా..?

అనుమతిస్తే పాదయాత్ర చేస్తానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత అంబటి రాంబాబు.. రెండు కిలోమీటర్ల నడవ లేని పవన్ కళ్యాణ్.. రాయలసీమ నుంచి రాజధానికి నడుస్తారా..? అంటూ ఎద్దేవా చేశారు. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ డిపాజిట్ల కోల్పోయిందన్న ఆయన.. రెండు చోట్లా ఓడిపోయిన  పవన్ కళ్యాణ్.. సీఎం జగన్మోహన్ రెడ్డిని గుర్తించకపోతే కొంపలు మునిగిపోతాయా? అని ప్రశ్నించారు. క్రిస్టియన్ మతం గురించి గొప్పగా చెప్పిన పవన్.. ఇప్పుడు మతాలు మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు అంబటి.. పవన్ కళ్యాణ్ భార్య పిల్లలు క్రిస్టియన్స్.. మరి పవన్ కళ్యాణ్ హిందువునా, క్రిస్టియనా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు బీజేపీకి తాను ఎప్పుడు దూరమయ్యానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అంబటి రాంబాబు.. పవన్ కల్యాణ్ చేగువేరా వారసుడుని అంటాడు.. వామపక్ష భావాలు అంటాడు.. అమిత్ షా నాకు ఇష్టమైన నేతని అంటాడు అంటూ సెటైర్లు వేశారు. ఇక, బాపిస్టు మతం తీసుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పాడు... తిరుపతి వెళ్లినప్పుడు ఆయన క్లరేషన్ తీసుకున్నారా..? అని ప్రశ్నించారు. పవన్‌కు స్థిరత్వం లేదని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. మరోవైపు చంద్రబాబుకు ఓడిపోయిన తరువాత ప్రతిపక్ష పార్టీలు గుర్తుకు వచ్చినట్టున్నాయని మండిపడ్డ వైసీపీ నేత.. అమరావతిలో రాజధాని గురించి ఏనాడు ప్రతిపక్ష పార్టీలతో చర్చించలేదని గుర్తుచేశారు. చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశానికి రాజకీయ పార్టీలు పెద్దగా స్పందించలేదని కామెంట్ చేసిన అంబటి.. రాజధాని నిర్మాణంలో అంతర్జాతీయ గ్రాఫిక్స్ చూపించారని సెటైర్లు వేశారు.