టీడీపీ శిబిరంలో ఉంది ముమ్మాటికీ పెయిడ్ ఆర్టిస్టులే..!

టీడీపీ శిబిరంలో ఉంది ముమ్మాటికీ పెయిడ్ ఆర్టిస్టులే..!

అవును.. ! టీడీపీ శిబిరంలో ఉన్న వాళ్లు ముమ్మాటికీ పెయిడ్ ఆర్టిస్టులే అన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు... రూ. 10 వేలు తీసుకుని శిబిరాలకు వెళ్లేవారు పెయిడ్ ఆర్టిస్టులు కాక మరేమిటీ? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ఛలో ఆత్మకూరుకు పోటీగానే మేం ఛలో ఆత్మకూరు పెట్టామన్న అంబటి.. టీడీపీ బాధితుల గోడును ప్రజలకు గుర్తు చేసేందుకే మేం ఛలో ఆత్మకూరు పెట్టినట్టు తెలిపారు. ఇక, చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అంబటి... కుక్క పని కుక్క చేయాలి.. గాడిద పని గాడిద చేయాలని ఆవ్యాఖ్యానించిన ఆయన.. బాధితులుంటే రక్షణ కల్పిస్తామని పోలీసులంటే.. ఆ పని నేనే చేస్తానని చంద్రబాబు ఎలా అంటారు..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు చంద్రబాబు నిరాహార దీక్షపై సెటైర్లు వేశారు అంబటి రాంబాబు.. 12 గంటలు కాదు.. 12 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్‌ను రన్ వే మీద అడ్డగించి వెనక్కు పంపిన విషయం టీడీపీకి గుర్తు లేదా..? అని ప్రశ్నించిన ఆయన.. 100 రోజుల్లో ఆరుగురిని చంపారని అంటున్న చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఒక్క రోజులో మాచర్లలో ఏడుగురు వైసీపీ కార్యకర్తలు హత్యకు గురైన ఘటన టీడీపీ హయాంలోనే జరిగిందని విమర్శించారు. గ్రామాల్లో చిన్నపాటి గొడవలకూ వైసీపీ ఎమ్మెల్యేలే కారణమంటే ఎలా..? అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.