ఆ సవాల్‌కు రెడీగా ఉండాలి: రాయుడు

ఆ సవాల్‌కు రెడీగా ఉండాలి: రాయుడు

4, 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేసే వారికి క్లిష్ట పరిస్థితుల్లోనే సత్తాను నిరూపించుకునే అవకాశాలు వస్తాయని టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ఈ స్థానాల్లో ఆడే ఆటగాళ్లు ఆ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలన్నాడు. ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో భారత్ 35 పరుగులతో విజయం సాధించింది. 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన రాయుడు.. 90 పరుగులతో సత్తాచాటాడు. విక్టరీలో కీ రోల్‌ పోషించిన రాయుడుకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రాయుడు మాట్లాడుతూ  అత్యున్నతమైన అటాకింగ్ బౌలింగ్ ఉన్న జట్టును ఎదుర్కోవడం చాలా కష్టమని చెప్పాడు.