పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత తండ్రి అయిన అంబటి రాయుడు... 

పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత తండ్రి అయిన అంబటి రాయుడు... 

భారత క్రికెటర్ అంబటి రాయుడు గురించి అందరికి తెలుసు. అయితే గత సంవత్సర కాలంగా రాయుడు కెరియర్ కష్టాలో ఉంది. ఇక ఈ కష్ట సమయంలో తన జీవితంలో అత్యంత సంతోషకరమైన సంఘటన జరిగింది. అదేంటంటే పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత తండ్రి అయ్యాడు. 2009 లో చెన్నుపల్లి విద్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంబటి రాయుడు. ఇక ఈ రోజు ఆవిడ ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు  తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇక రాయుడు 2018 నుండి ఐపీఎల్ లో సిఎస్కే తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ కోసం తనను ఎంపిక చేయకపోవడంతో నిరాశకు గురైన రాయుడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కానీ తర్వాత దానిని వెనక్కి తీసుకున్నాడు.