అంబటి రాయుడు సంచలన నిర్ణయం

అంబటి రాయుడు సంచలన నిర్ణయం

తెలుగు తేజం, టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. వరల్డ్‌కప్‌లో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డ రాయుడు ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. మొత్తం 55 వన్డేలాడిన రాయుడు 47.05 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.  ఆరు అంతర్జాతీయ టీ20లు ఆడి 42 పరుగులు సాధించాడు.