కోహ్లీ లేకున్నా.. ధోని ఉన్నాడు

కోహ్లీ లేకున్నా.. ధోని ఉన్నాడు

ఆసియా కప్ టోర్నీకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకున్నా.. ఎంఎస్ ధోనీ ఉన్నాడని అంబటి రాయుడు అన్నాడు. యోయో పరీక్షలో పాసై అంబటి రాయుడు ఆసియా కప్ టోర్నీకి ఎంపికైయ్యాడు. సోమవారం రాయుడు మీడియాతో మాట్లాడుతూ... ఆసియా కప్‌కు విరాట్‌ కోహ్లీ దూరం కావడం పెద్ద లోటే, అయినా జట్టులో సీనియర్ ప్లేయర్ ఎంఎస్ ధోనీ ఉన్నాడని తెలిపాడు. ధోనీ జట్టులో ఉంటే ప్రతి ఒక్కరికీ ధైర్యం ఉంటుందని, అతని సూచనలు జట్టుకు ఉపయోగపడుతాయి అని అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో రాణించేందుకు ధోని సాయం చేశాడని రాయుడు  తెలిపాడు.

ఆసియా కప్ టోర్నీ తనకు మంచి అవకాశమని రాయుడు అన్నాడు. అయితే వరల్డ్‌కప్‌కు జట్టులో స్థానం సంపాదించడం కోసం మిడిలార్డర్‌పై దృష్టి పెట్టి తనపై ఒత్తిడి పెంచుకొనన్నాడు. ప్రస్తుతానికి ఆసియా కప్‌ గురించి మాత్రమే ఆలోచిస్తున్నానన్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరమవడం నిరుత్సాహాన్ని కల్గించిందని.. ఆసియా కప్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉందని అంబటి రాయుడు తెలిపాడు.