అంబటి రాయుడు అనూహ్య నిర్ణయం..!

అంబటి రాయుడు అనూహ్య నిర్ణయం..!

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌ కప్ 2019లో చోటు చేసుకున్న పరిణామాలతో ఎవరూ ఊహించని విధంగా షాకిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకొని.. మళ్లీ బ్యాట్ పట్టాలని తహతహలాడుతున్నాడట ఈ హైదరాబాదీ క్రికెటర్. ప్రస్తుతం టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్‌ జట్టు తరపున ఆడుతోన్న రాయుడు... ఈ సందర్భంగా టీమిండియా తరుఫున టీ-20 మ్యాచ్‌ల్లో ఆడాలని భావిస్తున్నట్టు తన మనసులోని మాట బయటపెట్టాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో తిరిగి అడుగుపెట్టాలన్న ఆలోచన తనకు ఉందని రాయుడు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సెలక్టర్లు తీసుకున్న నిర్ణయంతో ఆవేదనకు గురై రిలైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాననడం చర్చనీయాశంగా మారింది.