రాయుడు బౌలింగ్‌పై నిషేధం...

రాయుడు బౌలింగ్‌పై నిషేధం...

టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకుండా అతనిపై చర్యలు తీసుకుంది. అయితే దేశవాళీ, బీసీసీఐ పరిధిలో జరిగే టోర్నీలలో మాత్రం బౌలింగ్ చేయవచ్చని తెలిపింది. తాజాగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో ముగిసిన మొదటి వన్డే మ్యాచ్‌లో రాయుడు అనుమానస్పదంగా బౌలింగ్ చేసాడు. రాయుడు బౌలింగ్ యాక్షన్ అనుమానస్పదంగా ఉందని మ్యాచ్ రిఫరీ.. ఐసీసీకి ఫిర్యాదు చేసాడు. దీంతో రాయుడు తన బౌలింగ్ యాక్షన్ నిరూపించుకోవాలని ఐసీసీ 14 రోజుల గడువు ఇచ్చింది.

జనవరి 13లోగా రాయుడు బౌలింగ్‌ పరీక్షకు హాజరు కావాల్సింది. కానీ న్యూజిలాండ్‌ పర్యటనతో బీజీగా ఉన్న రాయుడు పరీక్షకు హాజరు కాలేదు. దీంతో ఐసీసీ క్లాజ్‌ 4.2 నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌ చేయకుండా నిషేధం విధించింది. రాయుడు పరీక్షకు హాజరై, తన బౌలింగ్‌ యాక‌్షన్‌ సరైనదేనని నిరూపించుకునే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.