కెప్టెన్‌గా అంబటి రాయుడు

కెప్టెన్‌గా అంబటి రాయుడు

హైదరాబాద్‌ రంజీ జట్టు పగ్గాలను అంబటి రాయుడికి అప్పగించారు. 2018-19 సీజన్‌లో రంజీ జట్టుకు రాయుడు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని హెచ్‌సీఏ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. విజయ్‌హజారే ట్రోఫీకి హైదరాబాద్‌ కెప్టెన్‌గా అక్షత్‌రెడ్డి వ్యవహరిస్తాడు. ఈ సీజన్‌లో జట్టు కోచ్‌గా అర్జున్‌యాదవ్‌, బౌలింగ్‌ కోచ్‌గా ఎన్పీ సింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా దిలీప్‌ను కొనసాగించనున్నట్టు కమిటీ సభ్యులు చెప్పారు.