రాయుడు-విజయశంకర్‌: సేమ్‌ టూ సేమ్‌

రాయుడు-విజయశంకర్‌: సేమ్‌ టూ సేమ్‌

అంబటి రాయుడుని కాదని విజయ్‌శంకర్‌కు వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఛాన్సివ్వడంపై లెక్కలేనన్ని విమర్శలొచ్చాయి. విజయ్‌శంకర్‌ సమర్థుడే అయినప్పటికీ.. కేవలం 3 మ్యాచుల్లో రాణించకపోయినంతమాత్రాన రాయుడుని పక్కనపెడతారా అంటూ సెలెక్టర్లను మాజీ ఆటగాళ్లు సైతం ప్రశ్నించారు. విజయ్‌ త్రీ డైమెన్షనల్‌ ఆటగాడని.. అందుకే రాయుడిని పక్కనపెట్టి అతనికి ఛాన్సిచ్చామని చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ చెప్పగా.. 'వరల్డ్‌ కప్‌ చూసేందుకు 3డీ గ్లాసెస్‌కు ఆర్డరిచ్చా'నంటూ రాయుడు కౌంటర్‌ కూడా ఇచ్చాడు.  

వరల్డ్‌కప్‌లో శంకర్‌ చోటుదక్కించుకున్నప్పటి నుంచి రాయుడితో పోలిక తేవడం మొదలుపెట్టారు. ఇద్దరిలో ఎవరు మెరుగైన ఆటగాడనే విషయం పక్కనపెడితే.. ఐపీఎల్‌ లీగ్‌ స్టేజ్‌లో 'ఇద్దరం ఒక్కటే' అనేలా ప్రతిభ కనబరిచారు. అంతేకాదు.. ఇద్దరూ చెరో 14 మ్యాచ్‌లు ఆడి సరిగ్గా 219 పరుగులే చేశారు. సగటు కూడా '19.90' సేమ్‌ టూ సేమ్‌! స్ట్రయిక్‌రేట్‌ విషయంలో మాత్రం రాయుడు (90.49)కంటే శంకర్‌ (120.32) కొంత మెరుగ్గా ఉన్నాడు.