అందుకే బీజేపీలో చేరా: అంబికా కృష్ణ

అందుకే బీజేపీలో చేరా: అంబికా కృష్ణ

దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అవసరం చాలా ఉందని ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ అంబికా కృష్ణ అన్నారు. టీడీపీ నుంచి ఇవాళ బీజేపీలో చేరిన ఆయన.. 'ఎన్టీవీ'తో మాట్లాడారు. దేశ ప్రజలంతా మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే తాను కూడా మోడీకి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. బీజేపీతో విభేదాలు వద్దని చంద్రబాబునాయుడుకి తాను గతంలోనే చెప్పానన్న అంబికా కృష్ణ.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలమైన పార్టీగా ఎదుగుతుందని అన్నారు. ఏపీలో తమది మొదటి అడుగని.. ప్రజలంతా బీజేపీకి మద్దతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.