'బాలయ్యకు చెప్పా.. బాబుకు చెప్పలేదు..'

'బాలయ్యకు చెప్పా.. బాబుకు చెప్పలేదు..'

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయానికి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆ పార్టీ మాజీ నేత, ఇవాళ బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ అన్నారు. బీజేపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు బ్రహ్మాండంగా పనిచేశారని అన్నారు. కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే ఓటమిని తెచ్చాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విభేదాలు, కాంగ్రెస్‌తో కలయిక, దాదాపు 60 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లవ్వడం వంటి కారణాల వల్ల ఓటమి తప్పలేదన్నారు.  ఈ విషయాలపై తాను చంద్రబాబుకు ముందే చెప్పినా ఆయన పట్టించుకోలేదన్నారు. టీడీపీని వీడుతున్న విషయాన్ని చంద్రబాబునాయుడికి చెప్పలేదని.. ఆయన అందుబాటులో లేరని తెలిపారు.  ఎమ్మెల్యే బాలకృష్ణకు తెలియజేశానని అంబికా కృష్ణ వివరించారు.