ఏపీలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ పై సందిగ్ధత...

ఏపీలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ పై సందిగ్ధత...

ఏపీలో ప్రారంభించిన రేషన్ సరుకుల డోర్ డెలివరీ కార్యక్రమం పై సందిగ్ధత నెలకొంది. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి రేషన్ సరుకుల డోర్ డెలివరీ కార్యక్రమం ప్రారంభించటానికి సన్నాహాలు చేసింది ప్రభుత్వం. అందులో భాగంగా ఇప్పటికే అన్ని జిల్లాలకు డోర్ డెలివరీ వాహనాలు కూడా చేరుకున్నాయి. కానీ తాజాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు లోకి రావడంతో దీని పై ఎస్ఈసీ వివరణ కోరింది. అయితే ఇది కొత్త పథకం కాదు అని పౌర సరఫరాల శాఖ వివరణ ఇవ్వనుంది. 2019 సెప్టెంబర్ లోనే శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని సీఎం జగన్ ప్రారంభించారు. అప్పటి నుంచే శ్రీకాకుళం జిల్లాలో డోర్ డెలివరీ విధానం కొనసాగుతుంది.