హక్కుల కౌన్సిల్‌ నుంచి అమెరికా ఔట్‌

హక్కుల కౌన్సిల్‌ నుంచి అమెరికా ఔట్‌

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమితి నుంచి అమెరికా వైదొలగింది. ఇజ్రాయిల్‌ పట్ల మొండి వివక్ష కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది. సమితిని సంస్కరించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను రష్యా, చైనా, క్యూబా, ఈజిప్టు అడ్డుకుంటున్నాయని అమెరికా ఆరోపించింది. 47 మంది సభ్యలున్న సమితిని పునర్‌ వ్యవస్థీకరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. సమితి మానవ హక్కుల కన్నా.. రాజకీయాలకే ప్రధాన్యం ఇస్తోందని.. ఇది ఇజ్రాయిల్‌ విషయంలో చాలా స్పష్టంగా కన్పిస్తోందని అమెరికా ఆరోపించింది.