అమెరికాపై ప్రతీకారం తీర్చుకున్న చైనా

అమెరికాపై ప్రతీకారం తీర్చుకున్న చైనా

చైనాకు చెందిన 200 బిలియన్ డాలర్ల వస్తువులపై పది శాతం చొప్పున అమెరికా సుంకం వేయడంతో చైనా కూడా స్పందించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే 6000 కోట్ల డాలర్ల వస్తువులపై సుంకం వేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా మాదిరిగానే పది శాతం సుంకం విధించింది. కొత్త సుంకాలు ఈనెల 24వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఎయిర్‌ క్రాఫ్ట్, సోయా బీన్‌, బీఫ్‌, కాఫీతో పాటు పలు వస్తువులపై సుంకాలు విధించింది. పూర్తి జాబితా ఇంకా విడుదల కావాల్సి ఉంది. అమెరికా తమ దేశ వస్తువులపై సుంకాలు విధించినందునే ప్రతీకారంగా తాను సుంకాలు విధించినట్లు చైనా పేర్కొంది.