సల్మాన్ కన్నా వారిద్దరే గొప్ప నటులట

సల్మాన్ కన్నా వారిద్దరే గొప్ప నటులట

సల్మాన్ ఖాన్ కు మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉందనే సంగతి అందరికి తెలిసిందే.  బాలీవుడ్ లో ఖాన్ త్రయం లదే హవా.  ఈ ముగ్గురే సినిమా ఇండస్ట్రీని శాసిస్తుంటారు.  ముగ్గురిలో ఎవరు బెస్ట్ అనే విషయంపై అనేక మంది అనేక రకాలుగా చెప్తుంటారు.  ఇదే విషయాన్ని సల్మాన్ ను ప్రశ్నిస్తే...  తనకంటే షారుఖ్, అమీర్ లు బెస్ట్ నటులని... ఫెయిల్యూర్స్ వచ్చినా వారు వాళ్ళ నటనతో తిరిగి వెంటనే గాడిలో పడతారని, తన విషయం అలా కాదని, సాదాసీదా నటనతో అలా నెట్టుకొస్తున్నానని అన్నాడు. 

సల్మాన్ నటించిన ట్యూబ్ లైట్, రేస్ 3 సినిమాలు పరాజయం పాలయ్యాయి.  ఈ రెండు తరువాత ఇప్పుడు సల్మాన్ భారత్ సినిమా చేస్తున్నాడు.  రంజాన్ కు ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  రీసెంట్ గా ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్ 3 మొదలు పెట్టారు.  ఇది క్రిస్మస్ కు రిలీజ్ అవుతుండగా... సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మూడో సినిమాను వచ్చే ఏడాది రంజాన్ కు రిలీజ్ చేస్తారట.