రజనీకాంత్ దర్శకుడితో అమీర్, అక్షయ్ సినిమా..!!

రజనీకాంత్ దర్శకుడితో అమీర్, అక్షయ్ సినిమా..!!

సౌత్ లో రజినీకాంత్ సినిమాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు.  అలాంటిది ఒకటికాదు వరసగా రెండు సినిమాలు చేసే ఛాన్స్ దక్కించుకున్న దర్శకుడు పా రంజిత్.  రజినీకాంత్ తో కబాలి, కాలా సినిమాలు చేశాడు.  రెండు సినిమాలు సూపర్ స్టైలిష్ గా ఉంటాయి.  సామాజిక అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టి తీసిన సినిమాలు ఇవి.  ఇలాంటి కంటెంట్ తో ఉన్న సినిమాలు మనవాళ్లకు పెద్దగా నచ్చవు.  రజినీకాంత్ లాంటి మాస్ హీరో.. సైలెంగ్ గా కూర్చొని ఫైట్స్ చేయకపోతే ఫ్యాన్స్ ఫీలైపోతారు.  కబాలి, కాలా సినిమాలు స్టైలిష్ గా ఉన్నప్పటికీ రజినీకాంత్ వంటి మాస్ హీరోకు కావాల్సిన ఫైట్స్ వంటివి లేకపోవడంతో సినిమాలు చెప్పుకోదగినంతగా ఆడలేదు. 

అయితేనేం ఈ సినిమాల దర్శకుడికి మరో ఛాన్స్ వచ్చింది.  అది కోలీవుడ్ లో కాదు.  బాలీవుడ్ లో.  ఏకంగా భారీ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది.  బ్రిటిష్ పరిపాలన కాలంలో ట్రైబల్ తరపున పోరాటం చేసిన బిర్సా ముండా జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్నది.  షరీమ్ మంత్రి, బియాండ్ క్లౌడ్ అనే సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి.  దీనికోసం ఈ సంస్థలు రూ.175 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.  అమీర్ లేదా అక్షయ్ కుమార్ లు ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.