అమీర్ మనసులో ఇలా అనుకుంటున్నాడట..!!

అమీర్ మనసులో ఇలా అనుకుంటున్నాడట..!!

అమిర్ ఖాన్ మోస్ట్ టాలెంటెన్డ్ హీరోల్లో ఒకరు.  నటుడిగానే కాదు.. అమీర్ లో అనేక విషయాలు దాగున్నాయి.  హీరోగా చేస్తూనే తారే జమీన్ పర్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.  దీని తరువాత మరలా దర్శకత్వం చేయలేదు.  

అలాగే అమీర్ అభిరుచి కలిగిన నిర్మాత కూడా.  అమీర్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా అనేక సినిమాలను నిర్మించారు.  లగాన్, దంగల్, తారే జమీన్ పర్ లు అందుకు ఉదాహరణలు.  మరలా దర్శకుడిగా మారే అవకాశం ఉందా అనే ప్రశ్నకు అమీర్ చెప్పిన సమాధానం విని అందరు షాక్ అయ్యారు.  దర్శకుడిగా మారాలి అన్నది తన కలఅని, తప్పకుండా దర్శకత్వం చేస్తానని చెప్పిన అమీర్, నటనకు గుడ్ బై చెప్పిన తరువాత దర్శకత్వం వైపు చూపు సారిస్తానని చెప్పాడు.