ఐపీఎల్ లో మలింగ రికార్డును ఈ భారత స్పిన్నర్ బ్రేక్ చేయగలడా..?

ఐపీఎల్ లో మలింగ రికార్డును ఈ భారత స్పిన్నర్ బ్రేక్ చేయగలడా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇది కేవలం మన దేశానికి సంబంధించిన టోర్నీ మాత్రమే. అయిన కూడా దీనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇందులో ఏ రికార్డు సాధించిన అది అంతర్జాతీయ క్రికెట్ లో సాధించిన విధంగానే అనుకుంటారు ఆటగాళ్లు, అభిమానులు. ఇక ఇందులో చాలా సీజన్ ల నుండి శ్రీలంక ఆటగాడు లసిత్ మలింగ ఓ రికార్డును తన పేరుమీదనే ఉంచుకున్నాడు. అదేంటంటే.. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ప్రస్తుతం మలింగ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో 122 మ్యాచ్ లు ఆడిన మలింగ 170 వికెట్లు తీసాడు. అందులో ఒక 5 వికెట్స్ హల్ కూడా ఉంది. అతని తర్వాతి స్థానం లో ఐపీఎల్ లో హ్యాట్రిక్స్ వీరుడు గా పేరు తెచ్చుకున్న అమిత్ మిశ్రా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ ఓ అత్యధికంగా మూడుసార్లు హ్యాట్రిక్స్ తీసిన మిశ్రా మొత్తం 147 మ్యాచ్ లు ఆడాడు. అందులో మొత్తం 157 వికెట్లు తీసిన మిశ్రాకు కూడా ఒక 5 వికెట్స్ హల్ ఉంది. ఇక మిశ్రా మలింగ రికార్డును బ్రేక్ చేయాలంటే ఇంకా 14 వికెట్స్  తీయాలి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ నుండి వ్యక్తిగత కారణాల వల్ల మలింగ తప్పుకున్నాడు. ఇది ఈ భారత స్పిన్నర్ కు మంచి అవకాశం. కాబట్టి ఈ ఐపీఎల్ 2020 లో మిశ్రా 14 వికెట్స్ తీస్తాడో.. లేదో చూడాలి.